Monday, January 20, 2025

జైలుకు పంపినా ధర్మం కోసం పోరాటం చేస్తా: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనను జైలుకు పంపినా ధర్మం కోసం పోరాటం చేస్తానని బిజెపి బహిష్కృత ఎంఎల్‌ఎ టి. రాజాసింగ్ చెప్పారు. ఈనెల 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లుగా మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు. లవ్ జిహాద్, గోహత్య, అవినీతిపై తాను మాట్లాడినట్లుగా ఆయన వివరించారు.

ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో తాను వ్యాఖ్యానించినట్లు రాజాసింగ్ చెప్పారు. మహారాష్ట్రలో తాను మాట్లాడితే మంగళ్‌హాట్ పోలీసులు తనకు లేఖలు అందిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈనెల 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News