Thursday, January 16, 2025

విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంగళూరు: సిఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ రివ్వాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుక్ను సంఘటన కర్నాటక రాష్ట్రంలోని పెనంబూర్ ప్రాంతం న్యూ మంగళూరు పోర్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాయ్‌చూర్‌కు చెందిన జాకీర్ హుస్సేన్ అనే (58) వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. మంగళూరు పోర్టు అథారిటీలోని ప్రధాన ద్వారం వద్ద జాకీర్ హుస్సేన్ విధులు నిర్వహిస్తున్నాడని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. రాత్రి విధులు నిర్వహించిన అనంతరం ఉదయం 6.30కి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడి గన్ తీసుకొని కాల్చుకున్నాడు. గన్ పేలిన శబ్ధం వినిపించగానే కొందరు పోలీసులు అక్కడికి వెళ్లేసరికి రక్తపు మడుగులో ఉన్నాడు. అప్పటికే చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. పెనంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పై అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News