Monday, December 23, 2024

నాణ్యమైన వస్త్రాలకు వేదిక మాంగళ్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : నాణ్యమైన వస్త్రాల కొనుగోలుకు మాంగళ్య షాపింగ్‌మాల్ వేదిక అని రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సినీ నటి రాశిఖన్నాలు అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌మాల్‌ను ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభకార్యాలు, వివాహా వేడుకలకు వస్త్రాలను కొనుగోలు చేసేందుకు దూరప్రాంతాలైన పెద్ద పట్టణాలకు వెళ్లకుండా నూతన డిజైన్లతో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు కావాల్సిన అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

సూర్యాపేట పరిసర ప్రాంతాల ప్రజలు అతి తక్కువ ధరలకే మా ంగళ్యలో వస్త్రాలను కొనుగోలు చేయవచ్చన్నారు. ఎంపీ బ డుగుల లింగయ్య యా దవ్, ఎమ్మెల్సీ రవీందర్‌రావులు మాట్లాడు తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సారధ్య ంలో సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలకు అతి సమీపంలో సూర్యాపేట ఉండడంతో వ్యాపార, వాణి జ్య రంగ స ంస్థలు నెలకొల్పేందుకు నిలయంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాల య సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, షాపింగ్‌మాల్ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, రాచర్ల కమలాకర్, పుల్లూరు అరుణ్, కాసం నమశ్శివా య, కాసం మల్లికార్జున్, కాసం కేథరినాథ్, కాసం శివప్రసాద్ తోడుపునూరు కార్తీక్, అరుణ్, కొల్లూరు వరుణ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

భారీగా తరలి వచ్చిన అభిమానులు
ప్రముఖ సినీనటి రాశిఖన్నా బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు సూర్యాపేట కు చేరుకున్నారు. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో షాపింగ్‌మాల్ వద్దకు చేరుకున్నారు. ఆమెతో కరచలనం, ఫోటోలు దిగేందుకు యువతి, యువకులు ప్రయత్నించారు. అనంతరం ఆమె షాపింగ్‌మాల్‌లో చీరలు, డ్రస్సును చూసి సందడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News