Monday, December 23, 2024

మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఫోక్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారును డిసిఎం ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్థరాత్రి మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఇంటికి వెళ్తుంది. తొండుపల్లి గ్రామ శివారులో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి డిసిఎం ఢీకొట్టడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. మంగ్లీ స్వల్పంగా గాయపడడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసిఎం కర్నాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా డిసిఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News