పలుచోట్ల నేలవాలిన పంటలు
మార్కెట్ యార్డులు, కొనుగోలు
కేంద్రాల్లో తడిసిన ధాన్యం
మామిడి, మిర్చి పంటలకు
నష్టం ఆందోళనలో రైతాంగం
ఈదురుగాలులకు పలు
గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు
అంతరాయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఖ మ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసాయి. అక్కడక్కడ రాళ్ళతో కూడిన వర్షం ప డింది. ఈదురుగాలులతో పలు గ్రామాల్లో విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. చాలా గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈదురుగాలులు, ఉరుములు, మె రుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కుప్పలపై వేసిన పట్టాలు ఎగిరిపోయాయి. నిం డు వర్షంలో పట్టాలను కాపాడుకునేందుకు రై తులు తిప్పలు పడ్డారు. కల్లూరు మండలంలో అకాల వర్షం, భారీ ఈదురు గాలులతో వరి పంట నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలో ఆదివారం కురిసిన బారీ వర్షానికి మండల కేంద్రంలోని కొనుగోలు కేం ద్రం వద్ద కొంతమంది రైతులు ఆరబోసిన ధా న్యం తడిసిపోగా, మరికొంతమంది రైతులు పెద్దవాగు ప్రాంతంలో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. ఇంకా కొందరు రైతులు వరికోత కోయకపోవడంతో పంటలు నేలకొరిగాయి. సూర్యాపేట జిల్లా, తిర్మలగిరి, నాగారం, అర్వపల్లి మండలాల్లో గాలి, వడగండ్ల వర్షంతో బీభ త్సం.. సృష్టించింది. రైతులు ఆరుగాలం కష్టం చేసి పంటచేతికి వచ్చే సమయంలో పంట నేలరాలిపోవడంతో గోసపడుతున్నారు. ఆదివా రం సాయంత్రం జాజిరెడ్డిగూడెం, నాగారం, తి రు మలగిరి మండలాల్లో భారీ ఈదురు గాలులతో సాయంత్రం
వర్షం కురిసింది. గాలి దుమారానికి మామిడికాయలు రాలి భారీ నష్టం జరిగింది. నాగారం మండలంలోని నర్సింహ్ములగూడెం రహదారిపై భారీ వృక్షం నేలకూలడంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందుల ఎదురయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోగా అకస్మాత్తుగా గాలిదుమారం, వడకండ్ల వాన బీభత్సంతో ధాన్యాన్ని రాశులు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి చేను కోసే సమయానికి గాలి దుమారానికి వరి పంట మొత్తం నేల కొరిగి మూడు మండలాల్లో భారీ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండలంలో చిట్యాల, గుర్రెవుల, కన్నాయిగూడెం వివిధ గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం దంచి కొట్టడంతో పరిపంట నేలమట్టమైంది. ఆరబోసిన మిర్చి కల్లాల్లో తడిసి ముద్దయ్యింది. చేతికందేలోపే పంట నేలపాలు అవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.. జనగామ జిల్లాలోని ఆయా మండలాల్లో ఆదివారం కురిసిన వడగళ్ల వానకు తీవ్రపంట నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో ఉన్న వరిపంటతోపాటు మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, లింగాల ఘనపురంమండలం శామీర్‌పేట, సిద్దెంకి, ఎల్లంల గ్రామాల్లో మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో వడగళ్లు కురిశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వడగళ్ల వానకు మార్కెట్ యార్డుకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిముద్దయింది.