- Advertisement -
గాలిదుమారానికి నేలరాలిన మామిడి
ఈ ఏడాది అరకొరగా పండిన మామిడి పంట
మనతెలంగాణ/చండ్రుగొండ: భద్రాద్రి జిల్లా చండుగొండ మండలంలో సోమవారం రాత్రి వీచిన గాలిదుమారం అరకొరగా ఉన్న మామిడి పంటను నేలరాల్చింది. బీభత్సంగా వీచిన గాలి మామిడిరైతు ఆర్ధికంగా చితికిపోయాడు. మండలంలో సుమారు 2 నుండి 3 వేల ఎకరాల్లో మామిడిపంట విస్తారించి ఉంది. ఈ ఏడాది పంటకాలం మొదటిలో పూత సమృద్ధిగానే ఉన్న వాతవరణ ప్రభవం, చీడపీడల వలన పూత రాలిపోయింది. అరకొరగా పండిన పంట గాలిదుమారానికి నేలరాలడంతో మామిడిరైతులు దిగాలు చెందుతున్నారు. ప్రధానంగా దామరచర్ల, అయన్నపాలెం, సీతాయిగూడెం, రైతులు గాలిదుమారం మిగిల్చిన బీభత్సంతో ఆర్ధికంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహరం చెల్లించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు వాపోతున్నారు.
- Advertisement -