Thursday, January 23, 2025

ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న పొన్నియిన్‌ సెల్వన్‌–1

- Advertisement -
- Advertisement -

Mani Ratnam's PS-1 first film to release in IMAX

మైదరాబాద్: ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌ మరియు లైకా ప్రొడక్షన్స్‌ దక్షిణ భారత చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌–1ను ఐమ్యాక్స్‌ స్ర్కీన్స్‌పై ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఐమ్యాక్స్‌ తెరపై విడుదల కాబోతున్న మొట్టమొదటి తమిళ చిత్రం ఇది. సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది.

పొన్నియిన్‌ సెల్వన్‌–1 చిత్రం 10వ శతాబ్దంలో చోళ యువరాజు అరుణ్‌మొజి వర్మన్‌ జీవితపు తొలినాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆయనే అనంతర కాలంలో రాజ రాజ చోలగా ఖ్యాతిగడించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజుగా ఆయన నిలువడంతో పాటుగా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో తమ సామ్రాజ్యం విస్తరించాడు.

పొన్నియిన్‌ సెల్వన్‌–1 చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. సుబాస్కరణ్‌, మణిరత్నం దీనిని నిర్మించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలను రూపొందించిన లైకా ప్రొడక్షన్స్‌ దీనికి నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.‘‘అన్ని రకాల అభిమానులకు గమ్యస్థానంగా ఐమ్యాక్స్‌ కొనసాగుతుంది. అంతర్జాతీయ వేదికపై మా కంటెంట్‌ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడం, వైవిధ్యపరచడం ఎలా కొనసాగిస్తున్నామనేదానికి పొన్నియిన్‌ సెల్వన్‌–1 ఒక చక్కటి ఉదాహరణ’’ అని మేగన్‌ కొల్లిజన్‌, ప్రెసిడెంట్‌ –ఐమ్యాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని పెద్ద స్ర్కీన్‌కు తీసుకురావడానికి అమితాసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. ‘‘ఐమ్యాక్స్‌ తెరపై ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు పొన్నియిన్‌ సెల్వన్‌–1ను చూడబోతుండటం పట్ల మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ ఈ చిత్ర రూపకర్తల దూరదృష్టికి పూర్తి న్యాయం చేయగలదని, వీక్షకులకు మరిచిపోలేని అనుభూతులను పంచుతుందని నమ్ముతున్నాము’’ అని అశీష్‌ సింగ్‌, సీఈఓ–లైకా ప్రొడక్షన్స్‌ అన్నారు.

Mani Ratnam’s PS-1 first film to release in IMAX

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News