Wednesday, January 22, 2025

అపార్థాల పాలయిన ప్రధాని : మణిశంకర్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ దేశానికి పలువురు ప్రధానులు అయ్యారని, అయితే తన అనుభవంలో రాజీవ్ గాంధీ అంతగా నిందల పాలయిన ప్రధాని వేరేవారు లేరని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ విశ్లేషించారు. తన రాజకీయ అనుభవాలతో ఆయన తాజా పుస్తకం వెలువరించారు. ఓ దశలో ప్రధానిగా రాజీవ్ ఉన్నప్పుడు పిఎంఒలో అయ్యర్ జాయింట్ సెక్రెటరీగా కూడా వ్యవహరించారు. డూన్ స్కూల్, కేంబ్రిడ్జి విద్యాసంస్థలో రాజీవ్‌కు సీనియర్ కూడా. దేశంలో నిరాధార అభియోగాలతో అపార్థానికి ఎక్కువగా గురైన ప్రధాని రాజీవ్ గాంధీ అని ఈ పుస్తకంలో అయ్యర్ పేర్కొన్నారు.

బోఫోర్స్ స్కామ్ ఆదిగా ఆయనపై వచ్చిన ఏ ఆరోపణలో కూడా సరైన ప్రాతిపదిక లేదని తెలిపారు. తనకు రాజీవ్ బాగా తెలుసునని పేర్కొన్న అయ్యర్ బోఫోర్స్ స్కామ్‌లో రూ 1,437 కోట్ల ముడుపుల వ్యవహారం ఆ తరువాత రాజీవ్ గాంధీ సారధ్యపు ప్రభుత్వ పతనానికి దారితీసిందని గుర్తు చేశారు. నిజానికి ఆయనపై అభియోగాల సంబంధిత బోఫోర్స్ వార్తాకథనాలన్ని కూడా నిరాధారం అని తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు కూడా తెలియచేశాయని గుర్తు చేశారు. అయితే ఆయన నిజాయితీని దెబ్బతీసేలా మీడియా కట్టుకథలు వెలువడ్డాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News