Sunday, September 8, 2024

రజనీ, కమల్‌లు రాజకీయాల్లో పరిమిత ఆటగాళ్లే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సినీ రంగంలో సూపర్‌స్టార్లుగా, రాజకీయాల్లో పరిమిత ఆటగాళ్లుగా మిగిలిపోతారని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. వీరిద్దరూ తమ రాజకీయాలకు అనుగుణంగా ప్రజల్ని ఆకర్షించలేరని అయ్యర్ తేల్చి చెప్పారు. తమిళ రాజకీయాలు ఇప్పటికే నిర్ణయమయ్యాయని, రజనీ రాజకీయాల్లోకి వస్తానన్నపుడు పెద్దగా తేడా ఏమీ ఉండదని అన్నానని, మళ్లీ అదే మాట అంటున్నానని అయ్యర్ వివరణ ఇచ్చారు. ఎంజిఆర్, శివాజీ గణేశన్, జయలలిత లాంటివారు తమ సినిమాల్లో సామాజిక సందేశాలిచ్చే విప్లవ పాత్రల్లో నటించారు. వారి కాలానికీ, ఇప్పటి పరిస్థితులకూ తేడా ఉన్నదని అయ్యర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు సిఎన్ అన్నాదురై ఆనాటి సినిమాలకు శక్తివంతమైన స్క్రిప్టులు రాయగా, కరుణానిధి సంభాషణలు రాశారని అయ్యర్ తెలిపారు. అమితా బ్‌బచ్చన్, రాజేశ్‌ ఖన్నాలు ఉత్తరాది సినిమాల్లో సూపర్‌స్టార్లు అయినా, రాజకీయాల్లో ఫ్లాపయ్యారని అయ్యర్ గుర్తు చేశారు. కమల్‌హాసన్ 2018 ఫిబ్రవరిలో మక్కల్‌నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) పేరుతో పార్టీ స్థాపించగా, రజనీకాంత్ ఈ జనవరిలో పార్టీ స్థాపిస్తానని చెప్పి, ఆరోగ్య కారణాలతో ఆలోచన విరమిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Mani Shankar comments on Rajini and Kamal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News