Thursday, January 23, 2025

తెలంగాణకు మణిహారం హరితహారం

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు : తెలంగాణకు మణిహారం హరితహారం అని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని ముసలిమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సందేళ్ల రామాపురం గ్రామంలోని ఫారెస్ట్ నర్సరీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.

పలువురు ఫారెస్ట్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. తొలుత పలువురు అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొక్కలను నాటి పచ్చదనం కల్పించాలనేది సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల హరితహారం కార్యక్రమం ఒకటని అన్నారు. హరితహారం కార్యక్రమంతో గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.

ప్రతి గ్రామంలో మొక్కలు నాటుతున్నారని అందరికీ అందుబాటులో మొక్కలను అందజేయడం కోసం గ్రామాలలోనే నర్సరీలను స్థాపించి అందుబాటులోని అనేక రకాల మొక్కలు పెంచడం జరుగుతుంది అన్నారు. పచ్చదనం పెంపొందించినప్పుడే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ కురసం వెంకటరమణ, మాజీ ఎంపిటిసి సభ్యులు వల్లూరుపల్లి వంశీకృష్ణ, గుంటుపల్లి రామకృష్ణ, చైతన్య రెడ్డి, ఏసోబు, బాలి శ్రీహరి, ఉద్యమ నాయకులు పోడియం నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News