హైదరాబాద్: గాంధీభవన్ లో పిసిసి ఉపాధ్యక్షులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే క్లాస్ పీకారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులందరికీ ఆహ్వానం పంపారు. అయితే 34 మందిలో కేవలం 9 మంది ఉపాధ్యక్షులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంతో థాక్రే సీరియస్ అయ్యా రు. సమావేశానికి గైర్హాజరైన ఉపాధ్యక్షులపై క న్నెర్రజేశారు. మరోవైపు పార్టీ అప్పగించిన ప నులు చేయకపోవడం, జిల్లాలకు వెళ్లకపోవ డం వంటి అంశాలపైనా ఆయన ఆగ్రహం వ్య క్తం చేశారు. పార్టీ లైన్ దాటితే తప్పించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీ సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేశారు.
సమావేశానికి హాజరు కాని వా రంతా వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. శుక్రవారం మరోసారి సమావేశం కావాలని ని ర్ణయించారు. త్వరలో తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాణిక్‌రావు థాక్రే నేతల కు పలు లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు హా త్ సే హాత్ జోడో యాత్రలో కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. కానీ నేతలు అటు పక్క తొంగి చూడకపోవడంతో తీవ్ర అసహనం వ్య క్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇటు పార్టీ సమావేశాల్లో పాల్గొనక, అటు తమకు అ ప్పగించిన పార్టీ బాధ్యతలను విస్మరించడా న్ని థాక్రే తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని, హైకమాండ్‌కు నివేదిక అందజేస్తానని కూడా సమావేశంలో పేర్కొన్నారు.
ఐక్యతగా ఉండి, పార్టీని పరుగులు పెట్టించి విజయతీరాలకు చేర్చే సమయంలో ఈ విధంగా సమావేశాలకు హాజరుకాకుండా పార్టీ వ్యవహా రాలపై అంటీ ముంటనట్టుగా వ్యవహరించడం సమంజసం కాదని పే ర్కొన్నారు. ఇకనుంచైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి పార్టీ విజయం దిశగా నడుం బిగించాలని కోరారు. ఒకవేళ అలా కాదని పార్టీ లైన్‌ను దాటితే వేటు తప్పదని సదరు సమావేశంలో థాక్రే నేతలకు స్పష్టం చేశారని సమాచారం. తాను కూడా త్వరలో పార్లమెంటు నియోజక వర్గాలల్లో పర్యటిస్తానని ఈ నెల 28వ తేదీన భువనగిరి, మార్చి 1వ తేదీన నల్గొండ, 2వ తేదీన ఖమ్మంలో పర్యటించనున్నట్లు వివరించారు. ఇంఛార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వహించనట్లయితే తక్షణమే వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని, పార్టీకి సమయం కేటాయించని వారు ఎంతటి వారైనా అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు.