Wednesday, January 22, 2025

త్రిపుర కొత్త సిఎం మాణిక్ సాహా

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి విప్లవ్
కుమార్ దేవ్ రాజీనామాతో
కొత్త సిఎం ఎంపిక

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా
మాణిక్ సాహా
బిప్లవ్‌కుమార్ దేబ్‌కు ఉద్వాసన, బిజెపి ఎల్‌పి భేటీలో బాహాబాహీ
అగర్తలా : అత్యంత విస్మయకర పరిణామంలో త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను బిజెపి అధినాయకత్వం నియమించింది. సాహా రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ శనివారమే పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే ఈ స్థానంలో మాణిక్‌ను బిజెపి ఎంపిక చేసింది. సాహా త్రిపుర బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం ఆదేశాలతో వెంటనే బిజెపి లెజిస్టేచర్ పార్టీ సమావేశం హుటాహుటిన సిఎం అధికార నివాసంలో జరగడం, అక్కడ సాహాను బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకోవడం జరిగింది. అంత కు ముందు విప్లవ్ దేబ్ గవర్నర్ ఎస్‌ఎన్ ఆర్యను కలిసి తమ రాజీనామా పత్రం సమర్పించారు. దీనితో కొత్త ముఖ్యమంత్రి రాకకు వీలేర్పడింది. 69 సంవత్సరాల సాహా పేరును స్వయ ంగా దిగిపోయిన సిఎం ప్రతిపాదించారు. అయితే ఈ దశలో కొంత అసమ్మతి తలెత్తింది. మంత్రిగా ఉన్న రామ్ ప్రసాద్ పా ల్ నిరసన వ్యక్తం చేశారు.

దీనితో ఎమ్మెల్యేల మధ్య పరస్పర దూషణలు చెలరేగాయి. చివరికి ఇవి బాహాబాహికి దారితీశా యి. పౌల్ అక్కడున్న కుర్చీలను విసిరికొట్టారు. తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఇంతకు ముందటి రాజకుటుంబ సభ్యు లు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మను సిఎం చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఈ వాదన పనికిరాకుండా పోయింది. శనివారం వెంటవెంట కీలక పరిణామాలు జరిగాయి. సిఎం బిప్లవ్ దేబ్‌ను ఢిల్లీకి బిజెపి అధినాయకత్వం పిలిపించింది. అక్కడ ఆయన అమిత్‌షాను, జెపి నడ్డాను కలిశారు. వారితో మాట్లాడిన తరువాత తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తరువాత అగర్తలాలో కొత్త సిఎం ఎంపిక తరువాత ఎన్నిక జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News