Wednesday, January 22, 2025

త్రిపుర సిఎంగా మాణిక్ సాహా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రిగా బిజెపి నేత , 70 సంవత్సరాల డాక్టర్ మాణిక్ సాహా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ అత్యంత కీలకమైన సరిహద్దు ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి తమ బాధ్యతలు తీసుకున్నారు. గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యా సిఎంతో, ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా , మణిపూర్ సిఎం ఎన్ బీరెన్ సింగ్ ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విపక్షాలైన వామపక్షాలు, కాంగ్రెస్ బహిష్కరించాయి. ఎన్నికల అనంతర హింసాకాండ జరుగుతోందని విమర్శిస్తూ నిరసనకు దిగారు. సిఎంతో కలిసి తొమ్మండుగుతో కూడిన కేబినెట్‌లో ఎనిమిది మంది బిజెపి వారు కాగా మిత్రపక్షం అయిన ఐపిఎఫ్‌టి నుంచి ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. ఇప్పటి ఎన్నికలలో ధన్పూర్ నుంచి గెలిచిన కేంద్ర మంత్రి ప్రతీమా భౌమిక్ ప్రమాణస్వీకారం చేయలేదు. మంత్రి మండలిలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News