Saturday, November 23, 2024

ఓట్ల కోసమే కెసిఆర్ హామీలు: థాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు కలసి రాజకీయాలు చేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ఆరోపించారు. బయటకు బిజెపిపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ అంటున్నారు.. కానీ ఢిల్లీలో కలిసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నిర్వహించిన ఓటర్ల జాబితా అవగాహన సదస్సులో మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కెసిఆర్ ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇస్తున్నారు తప్ప.. ప్రజల కోసం ఏమి చేయడం లేదు. తెలంగాణ ప్రజలను దోచుకొని కెసిఆర్ కేవలం తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఏమి చేయలేదు.

తెలంగాణ ప్రజలను దోచుకొని మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో అప్పుల చేశారు. ఎక్కడ పోయాయి ఆ డబ్బులు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఇక్కడ ఉంది. తెలంగాణ ప్రజలను దోచుకొని మళ్ళీ వారికి ఏదో చేసినట్టు బ్రమలు కల్పించి ఓట్లు పొందాలని చూస్తూన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. కేసీఆర్ ను ఓడించి తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలి. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చాలా కీలకంగా భావించాలి. బిఎల్ఏలకు ఎన్నికల కమిషన్ ను అడిగే హక్కు ఉంటది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసే అక్రమాలను నివారించాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News