Friday, April 4, 2025

నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి: ఠాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని ఎఐసిసి ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయేది మన ప్రభుత్వమేనని, మనం కష్టపడితే అధికారం మనదే నన్నారు. తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను, వాస్తవాలను జనంలోకి తీసుకు పోవాలని సూచించారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చెయ్యాలన్నారు. జనంలోనే ఉండాలి, మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు చెప్పాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News