Monday, December 23, 2024

బిజెపితో వైరం అంటూనే.. ఢిల్లీలో చేతులు కలుపుతున్నారు: థాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు థాక్రే ఆరోపించారు. ఒప్పందం లేకుంటే ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు కూతురు, ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ కేసులో చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో 30 శాతం ప్రభుత్వం ఉంటే.. తెలంగాణలో 50శాతం సర్కార్ ఉందని విమర్శించారు.

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బిజెపితో వైరం అంటున్నారు.. ఢిల్లీలో అమిత్ షాను కలుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News