Monday, December 23, 2024

మణిపాల్ హెల్త్‌మ్యాప్ చేతికి మెడ్‌సిస్ పాత్‌ల్యాబ్

- Advertisement -
- Advertisement -

Manipal HealthMap buys Medcis PathLabs

న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ డయాగ్నొస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ మణిపాల్ హెల్త్‌మ్యాప్ హైదరాబాద్‌కు చెందిన మెడ్‌సిస్ పాత్‌లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని మెజారిటీ వాటాకొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మణిపాల్ హెల్త్‌మ్యాప్ సిఇఒ డాక్టర్ (కెప్టెన్) సందీప్ శర్మ మాట్లాడుతూ, కచ్చితత్వం, స్పీడ్ రిపోర్టింగ్, అత్యాధునిక సాంకేతికత సంస్థ ప్రత్యేకత అని అన్నారు. రేడియాలజీ, పాథాలజీ సేవలు సరసమైన ధరల్లో అనేక రాష్ట్రాల్లోని రోగులకు సేవ చేయడానికి ఈ కలయిక ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మెడ్‌సిస్ పాత్‌లాబ్స్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని దక్షిణ, పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో 17 ల్యాబ్‌లు ఉన్నాయని అన్నారు. మెడ్‌సిస్ పాత్‌లాబ్స్ సిఇఒ భరత్ కుమార్ అనగాని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ సేవల్లో అధిక క్లినికల్, సర్వీస్ ఎక్సలెన్స్‌ను అందించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన మణిపాల్ హెల్త్‌మ్యాప్‌తో భాగస్వామ్యం ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News