Sunday, November 17, 2024

మైక్రో చిప్‌లతో పెట్రో లూటీ

- Advertisement -
- Advertisement -
Manipulation of microchips in petrol bunks
లీటర్ వద్ద 30 నుంచి 50ఎంఎల్ స్వాహా

మన తెలంగాణ/ జగద్గిరిగుట్ట : పెట్రోల్ బంక్‌లలో మైక్రో చిప్‌లు ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడుతూ మూడు రాష్ట్రాలలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను బాలానగర్ ఎస్‌ఓటి, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్ జోన్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డిసిపి పి.వి. పద్మజ వివరాలను వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన యండి. ఫయాజుల్ బారి(46), అల్వాల్‌కు చెందిన కురడె సందీప్ (38), బండ్లగూడకు చెందిన యండి.అస్లాం (29) యాదాద్రి భవనగిరి జిల్లా వెలిగొండ మండలం లింగరాజ్‌పల్లికి చెందిన కలిమెర నర్సింగ్‌రావు (32)లు గతంలో పెట్రోల్ పంపులో పని చేశారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచనతో పెట్రోల్ పంప్ టెక్నిషియన్‌గా పని చేసిన అనుభవం ఉంది, దీంతో ముఠాగా ఏర్పడి రాజస్తాన్‌లోని సూరజ్ అనే వ్యక్తి డెవలప్‌చేసిన ఓ మైక్రో చిప్‌ను లీటర్‌కు 30ఎంఎల్, 50 ఎంఎల్ వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసిన చిప్‌ను తీసుకుని లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్రోల్ బంక్ డీలర్లకు విక్రయించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు లీగల్ మోట్రోలజి అధికారులతో పాటు సైబరాబాద్ ఎస్‌ఓటి డిసిపి సందీప్, ఎస్‌ఓటి బాలానగర్ సీఐ జెమ్స్‌బాబు, జీడిమెట్ల, మేడ్చల్ పోలీసులు రంగంలోకి దిగి నింధితుల కోసం గాలించి పట్టుకుని విచారించగా ఈ మైక్రో చిప్‌లను తెలంగాణ, ఎపి, కర్ణాటక రాష్ట్రాల్లోని 34 పెట్రోల్ బంక్‌లలో అమర్చినట్లు నింధితులు తెలిపారు. కామారెడ్డి, వనపరి, ఖమ్మం, సిద్దిపేట, నెల్లూరు, సూర్యాపేట ప్రాంతాలతో పాటు కర్ణాటక, ఎపిలో చిప్‌లు అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని నింధితులతో పాటు పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులు హకింపేట టిఎస్‌ఆర్‌టిసి నిర్వాహకుడు వంశీధర్‌రెడ్డి, పూడుర్ మేడ్చల్ హరిహర ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకుడు రంగు రమేష్, మైలార్‌దేవ్‌పల్లి జీఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ సూపర్‌వైజర్ బీరవెల్లి మహేశ్వర్, జీడిమెట్లలోని లక్ష్మీ గణేష్ బంక్ నిర్వాహకుడు నాగండ్ల వెంకటేష్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ ముఠాపై జీడిమెట్ల, మైలార్‌దేవులపల్లి, మేడ్చల్, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ముఠాను మరోసారి అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశముందన్నారు. నింధితుల వద్ద నుంచి చిప్స్‌లు, అందుకు వినియోగించిన ల్యాప్‌టాప్స్, రెండు కార్లు, 66 రకాల ఎలక్ట్రికల్ వస్తువులను సీజ్ చేశారు. వినియోగదారులు పెట్రోల్ బంక్‌ల్లో తక్కువగా వస్తుందని అనుమానం వస్తే కొలత చూపించాలని అడుగాలని సూచించారు. ఏలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డు కోసం ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News