Monday, January 20, 2025

పేలుడులో దెబ్బతిన్న మణిపూర్ వంతెన

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ లోని ఇంఫాల్, నాగాలాండ్ లోని దిమాపూర్‌లను కలిపే వంతెన బుధవారం తెల్లవారు జామున మందుగుండు పదార్ధాల పేలుడులో దెబ్బతింది. వంతెన మధ్య మూడు గుంతలు పడగా, రెండు చివర్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. సపెర్‌మెయినా, కౌబ్రులెయిఖా ప్రాంతాల మధ్యన ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బ్రిడ్జికి రెండు వైపుల చివరన పదార్ధాలను గుర్తించారు.

వంతెనపై భారీ వాహనాల రాకపోకలను ఆపివేశారు. పేలుడు తరువాత పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి తరలివెళ్లారు. బ్రిడ్జి చుట్టూ దిగ్బంధం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన వాలంటీర్ల మధ్య తుపాకీ కాల్పులు చోటు చేసుకున్న తరువాత కొన్ని గంటలకు బ్రిడ్జి పేలుడుకు గురైంది. అంతకు ముందు బ్రిడ్జిపై బుధవారం ఉదయం రెండు వీలర్లు వెళ్లినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News