Monday, February 10, 2025

మణిపూర్ సిఎం బీరేన్ సింగ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం గౌరవమని వ్యాఖ్య

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం తన రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. బీరేన్ సింగ్ వెంట బిజెపి, ఎన్‌పిఎఫ్‌కు చెందిన 14 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎ శారద, బిజెపి సీనియర్ నేత సంబిత్ పాత్రా కూడా ఆ ప్రతినిధివర్గంలో ఉన్నారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం బీరేన్ సింగ్ సిఎం సచివాలయానికి వెళ్లారు. ‘ఇంత వరకు మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవప్రదం.

ప్రతి ఒక్క మణిపూర్ పౌరుని ప్రయోజనాల పరిరక్షణకు సకాలంలో చర్యలకు, జోక్యాలకు, అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వానికి నేను ఎంతగానో కృతజ్ఞుడిని’ అని బీరేన్ సింగ్ గవర్నర్‌కు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. బీరేన్ సింగ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకున్నది. సోమవారం (10) ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ సందర్భంగా బీరేన్ సింగ్ శనివారం సిఎం సచివాలయంలో బిజెపి నాయకత్వంలోని అధికార కూటమి ఎంఎల్‌ఎలతో సమావేశం ఏర్పాటు చేశారు. బీరేన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయం నేపథ్యంలో ఆ సమావేశం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News