Monday, December 23, 2024

కుదుటపడ్డ మణిపూర్..

- Advertisement -
- Advertisement -

కుదుటపడ్డ మణిపూర్
11 జిల్లాల్లో కర్ఫూ సడలింపు
ఇంఫాల్: మణిపూర్‌లో క్రమేపీ సాధారణ జనజీవన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, ఉద్రిక్తతల కేంద్రం అయిన ఛురాచంద్‌పూర్, జిరిబాబ్ సహా మొత్తం 11 జిల్లాల్లో ఆరుగంటలు కర్ఫూ సడలించారు. ఈ దశలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. మైతీ తెగకు ఎస్‌టి హోదా కల్పన సంబంధిత విషయం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఘర్షణలకు దారితీసింది. గిరిజనులు, గిరిజనేతరులు, చివరికి వివిధ కులాల మధ్య ఘర్షణలు జరిగాయి.

కనీసం 60 మంది వరకూ మృతి చెందారు. 30వేల మందికి పైగా నిర్వాసితులు అయ్యారు. కేంద్రీయ బలగాలు తరలిరావడం, సైన్యం నిరంతర పహారాకు దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ మరింత ప్రశాంతత దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని మైదాన ప్రాంతాలతో పాటు ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో కూడా నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News