Saturday, January 4, 2025

మణిపూర్ పాపం మీదే:బీరేన్ సింగ్

- Advertisement -
- Advertisement -

మణిపూర్ రగిలిపోతున్నా, వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక వైపు మణిపూర్ వాసులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మోడీ మాత్రం విదేశీ పర్యటనలకు వెళుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తరువాత ఆలోచించవచ్చు కానీ ముందు మణిపూర్ మంటలను చల్లార్చాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్న విషయం విదితమే. ఈ ఆరోపణలపై ప్రధాని మోడీ గానీ, బిజెపి పెద్దలు గానీ అంతగా స్పందించలేదు. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. జైరామ్ రమేష్ ట్వీట్‌ను బీరేన్ సింగ్ రీట్వీట్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అసలు మణిపూర్‌లో మంటలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1992లో మణిపూర్‌లో అల్లర్లు మొదలయ్యాయని బీరేన్ సింగ్ ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా ఉన్న పి చిదంబరం మయన్మార్‌తో, మయన్మార్ తీవ్రవాదులతో కుడుర్చుకున్న ఒప్పందంతో మణిపూర్‌లో అల్లర్లకు బీజం పడిందని ఆయన తెలియజేశారు.

199297 కాలంలో మణిపూర్‌లోని నాగా, కుకీ తెగల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయని ఆయన ఆరోపించారు. బర్మా శరణార్థులకు మణిపూర్‌లో పదే పదే ఆశ్రయం కల్పించడం, ఇందు కోసం ఒప్పందం చేసుకోవడమే ప్రస్తుత సమస్యకు నాంది పలికిందని ఆయన తెలిపారు. 199293 కాలంలో మణిపూర్‌లో అల్లర్లు, తీవ్ర రక్తపాతం చోటు చేసుకున్నాయని బీరేన్ సింగ్ గుర్తు చేశారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ నేత పివి నరసింహారావు మణిపూర్‌లో పర్యటించారా? ఎందుకు పర్యటించలేదు? అని కాంగ్రెస్ నేతలను బీరేన్ సింగ్ నిలదీశారు. ఆ తరువాత కూడా199798 కాలంలో కుకీలు, మైతీల మధ్య గొడవలు జరిగి రాష్ట్రంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. అప్పుడు ప్రధానిగా ఉన్న ఐకె గుజ్రాల్ మణిపూర్‌లో పర్యటించారా? రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారా? అని బీరేన్ సింగ్ ప్రశ్నించారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంఎలా, అందుకు ఏమి చేయాలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వవలసింది పోయి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని బీరేన్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీరు అత్యంత శోచనీయమని ఆయన విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News