Thursday, December 19, 2024

రాజీనామా నిర్ణయం మార్చుకున్న మణిపూర్ సిఎం బీరేన్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రికి రాజీనామా చేయకూడదని ఎన్ బీరేన్ సింగ్ నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖను సమర్పించడానికి రాజ్‌భవన్‌కు వెళుతున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారని రాష్ట్ర సీనియర్ మంత్రి గోవిందాస్ గొంతౌజం శుక్రవారం మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు వెళుతున్న ముఖ్యమంత్రి చేతిలోని రాజీనామా లేఖను ప్రజలు లాక్కుని చింపివేశారని ఆయన చెప్పారు. ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎదుట భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిలలు చేరుకుని ఆయన రాజీనామా చేయకూడదంటూ నినాదాలు చేశారని మంత్రి తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు తన నివాసంలో క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది. దీంతో బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అంతకుముందు ప్రచారం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News