Monday, December 23, 2024

మణిపూర్ మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణం : సిఎం బీరేన్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : భారత్‌-మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు ఆదివారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్‌సింగ్ ఆదివారం సరిహద్దు రోడ్డు నిర్మాణ సంస్థ(బిఆర్‌ఎస్) అధికారులతో , హోంశాఖ, పోలీస్ అధికారులతో చర్చించారు. భారత్‌మయన్మార్ సరిహద్దు పొడవునా స్వేచ్ఛగా సాగే రాకపోకలను వెంటనే నిలిపివేసి, కంచె నిర్మాణం చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను అభ్యర్థించినట్టు ముఖ్యమంత్రి విలేఖరులకు వెల్లడించిన తరువాతనే ఈ సమావేశం జరిగింది.

సరిహద్దు మీదుగా పొరుగు దేశం నుంచి అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగుతున్నందున సరిహద్దు రక్షణ కోసం 70 కిమీ పొడవున కంచెనిర్మాణం తప్పనిసరి అని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా వివరించారు. చీఫ్ సెక్రటరీ, డిజీపి, హోం శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని సిఎం తెలిపారు. మయన్మార్‌తో మణిపూర్ 398 కిమీ పొడవున సరిహద్దును పంచుకుంటోంది. అందులో 6 కిమీ వరకే కంచె నిర్మాణం జరిగింది. మే నుంచి హింసాత్మక సంఘటనల కారణంగా మణిపూర్‌లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News