ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నేడు రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితుడైన ఒక సీనియర్ అధికారి శుక్రవారం ఉదయం వెల్లడించారు.
రాష్ట్ర గవర్నర్ అనుసూయా యూకీని కలుసుకునేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందచేయవచ్చని వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో హింసాకాండను కట్టడి చేయడంలో విఫలమైన కారణంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒక ప్రముఖ దినపత్రిక శుక్రవారం ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది. ముఖ్యమంత్రికి గురువారం ఢిల్లీ నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీరేన్ సింగ్ స్వయంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సంగై ఎక్స్‌ప్రెస్ అనే ఆంగ్ల దినపత్రిక తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీని సుషుప్తావస్థలో ఉంచి పాలనను కేంద్రం తన అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని పత్రిక తెలిపింది.