Wednesday, January 22, 2025

అమిత్ షాతో మణిపూర్ సిఎం భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయనకు వివరించారు. ఈ రోజు ఉదయం సింగ్ ఇక్కడికి చేరారు. నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లారు. పరిస్థితిపై ఇరువురు చాలా సేపు సమీక్షించారని అధికారులు తెలిపారు. సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకువచ్చేందుకు అన్నివిధాలుగా యత్నిస్తున్నట్లు అమిత్‌షాకు సిఎం వివరించారు.

దేశ రాజధానిలో ఒక్కరోజు క్రితమే మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. వెంటనే సిఎంను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రం తరపున అఖిలపక్ష బృందానికి రాష్ట్రానికి తీసుకువెళ్లాలని పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయాలు కూడా బీరెన్‌సింగ్‌తో అమిత్ షా మాట్లాడినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News