ఇంఫాల్ : మణిపూర్ లోని చురచాంద్‌పూర్ హింసాకాండపై మేజిస్ట్రేట్ విచారణకు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం , ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని బీరేన్‌సింగ్ పేర్కొన్నారు. ఈ హింసాకాండ యువతను ప్రేరేపించి, తప్పుదోవ పట్టించే చర్యగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస కారణంగా దెబ్బతిన్న బంగ్లాకు మరమ్మతులు చేయిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో హింసాత్మక నిరసన జరిగింది. భద్రతా బలగాల చర్య కారణంగా ఇద్దరు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ఐఆర్‌బి క్యాంపు కార్యాలయం నుంచి కాజేసిన నాలుగు ఇన్సాఫ్ రైఫిళ్లు, ఏకె ఘటక్ 2, ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగజైన్లు, 9 ఎంఎం మందుగుండ సామగ్రికి చెందిన 16 చిన్న పెట్టెలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్‌లు తెలిపారు.
చురచాంద్‌పూర్ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు సిఎం ఆదేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -