Wednesday, January 22, 2025

మణిపూర్ సంక్షోభం ప్రధానికి పట్టలేదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ సంక్షోభంపై జూన్ 24న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మణిపూర్ సంక్షోభంపై చర్చించడం ప్రధాని మోడీకి ముఖ్యం కాదు కాబట్టే ఆయన లేకుండా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.

మణిపూర్ గత 50 రోజులుగా తగటబడుతోంది. అయినప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. మోడీ దేశంలో లేనప్పుడే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానికి ది ముఖ్యమైన సమస్య కాదని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది అంటూ రాహుల్ గురువారం ట్వీట్ చేశారు.

కాగా..మణిపూర్‌పై హోం మంత్రి నిర్వహిస్తున్నఅ ఖిల పక్ష సమావేశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అంతకుముందు స్పందించారు. మణిపూర్ ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేశారని, ఇది చాలా ఆలస్యంగా జరుగుతున్న చాలా చిన్న ప్రయత్నమంటూ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. 50 రోజుల విధ్యంసం, మారణకాండ తర్వాత మణిపూర్‌లో హెం మంత్రి అమిత్ అఖిల పక్ష సమావేశానికి పిలుపు ఇవ్వడం చాలా చిన్న ప్రయత్నం, చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఆయన విమర్శించారు.

మణిపూర్ ప్రజలనుద్దేశించి సోనియా గాంధీ ప్రసంగించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం మేల్కొందంటూ ఆయన దుయ్యబట్టారు.
ఇటువంటి తీవ్రమై సమస్యను చర్చించేందుకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గైర్హాజరు కావడం తన వైఫల్యాలను ఎదుర్కోవడంలో ఆయన పిరికితనాన్ని, సంసిద్ధతారాహిత్యాన్ని బయటపెడుతోందని వేణుగోపాల్ ఆరోపించారు. చర్చల కోసం అనేక ప్రతినిధి బృందాలు కోరినప్పటికీ ప్రధాని మోడీకి తీరిక దొరకలేదని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News