Thursday, January 23, 2025

కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ సినిమా తీయాలి: శివసేన

- Advertisement -
- Advertisement -

ముంబై: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను అడ్డుకోవడంలో కేంద్రం, మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) శనివారం ఆరోపించింది. మణిపూర్ ఫైల్స్ పేరుతో ఒక సినిమా తీయాలని ఆ పార్టీ సూచించింది. శివసేన సొంత పత్రిక సామ్నాలో శనివారం ప్రచురించిన సంపాదకీయంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.

ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్‌లో జరుగుతున్న హింస, మహిళలపై అత్యాచారాలు ఒకప్పటిక కశ్మీరులో పరిస్థితి కన్నా ఘోరంగా ఉన్నాయని సామ్నా పేర్కొంది. మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను ప్రస్తావిస్తూ ఈ ఉదంతాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకోకపోయి ఉంటే ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పి ఉండేవారు కాదని సామ్నా పేవ్యాఖ్యానించింది. ఇటీవలి కాలంలో తాష్కెంట్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు రూపొందాయని, మణిపూర్‌లో జరుఉగుతున్న హింసాకాండపై అదే వ్యక్తులు ఇప్పుడు మణిపూర్ ఫైల్స్ అనే చిత్రం తీయాలని సామ్నా కోరింది.

మణిపూర్‌లో బిజెపియేతర ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే అది బర్తరఫ్ అయి ఉండేదని సామ్నా తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్ పట్ల రాజకీయంగా ప్రాధాన్యత లేదని, అందుకే ఆ రాష్ట్రాన్ని ఆయన పట్టించుకోవడం లేదని సామ్నా ఆరోపించింది. మణిపూర్‌లో 60,000 పారా మిలిటరీ బలగాలు మోహరించి ఉన్నాయని, అయితేప్పటికీ ఆ రాష్ట్రంలో హింసాకాండ ఆగలేదని సామ్నా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల అదుపులో లేదని అర్థమవుతోందని సామ్నా వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News