Saturday, November 16, 2024

కాప్-28 వేదికపై మణిపూర్ బాలిక నిరసన

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించే లక్షంతో దుబాయిలో జరుగుతున్న కాప్ 28 సదస్సులో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా వేదికపైకి చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వేదికపై ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేసింది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలంటూ లిసిప్రియ నినదించారు. చర్చలకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లిసిప్రియ వినలేదు.

తాను చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా అందరికీ వివరించింది. చివరకు ఇద్దరు భద్రత సిబ్బంది లిసిప్రియను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు. అయితే చర్చల్లో పాల్గొన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్ధిస్తూ చప్పట్లతో అభినందించారు. నిర్వాహకులు కూడా లిసిప్రియ చర్యను తప్పుపట్టక పోగా .. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని , ఆమె చర్యను కొనియాడటం విశేషం. ఈ సంఘటనపై కాప్ 28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ స్పందించారు. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్య పోయానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News