Sunday, November 3, 2024

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రం లోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం మణిపూర్ ప్రజల నుంచి బయోమెట్రిక్ డేటాను సేకరిస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రం లోకి ప్రవేశించి అక్కడే ఉంటున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్ డేటా సేకరణ ప్రారంభించాం.

ఈ ప్రక్రియ సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డేటా సేకరించడానికి జాతీయ నేరాలనమోదు సంస్థ నుంచి మణిపూర్‌కు ప్రత్యేక బృందాలు వచ్చాయి అని మణిపూర్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పీటర్ సలామ్ తెలిపారు. మణిపూర్‌లో హింసకు మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులతోపాటు నార్కో టెర్రరిజమ్ కూడా కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమం లోనే మయన్మార్ నుంచి మణిపూర్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను రెండు నెలల క్రితం ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు.

గత వారం రెండు రోజుల వ్యవధిలో సుమారు 700 మంది సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ నుంచి మణిపూర్ లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందుగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని తిరిగి మయన్మార్‌కు పంపేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కల్లోలిత మణిపూర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. దేశం లోని అన్ని పార్టీలు కలిసి మణిపూర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News