- Advertisement -
ఇంఫాల్: ప్రజలకు మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసులు సమకూర్చేందుకు మార్గాలను అన్వేషించవలసిందిగా మణిపూర్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మణిపూర్‌లో మే 3న హింసాకాండ రాజుకున్న అనంతరం నిలిపివేసిన మొబైల్ ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించాలని కోరుతూ వివిధ ప్రజాసంఘాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఇంటర్‌నెట్ సర్వీసులు కోరుతున్న వ్యక్తుల మొబైల్ నంబర్లను ఒక్కొటక్కొటిగా పరిశీలించి దశలవారీగా ఇంటర్‌నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని లేదా విధానాలను రూపొందించే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర అధికారులను ముఖ్యంగా హోం శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి విచారణ తేదీకి నివేదికను సమర్పించాలని కూడా జస్టిస్ అహంతం బిమోల్ సింగ్, జస్టిస్ ఎ గుణేశ్వర్ శర్మతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
- Advertisement -