Thursday, December 19, 2024

మణిపూర్ ప్రతిష్ట మంటగలిసింది: సిఎం బీరేన్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్ ప్రజలు మహిళలను మాతృమూర్తిగా పరిగణిస్తారని, కాని ఇద్దరు గిరిజన మహిళలపై దాడి చేసిన మూకలు వారిని వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించడంతో రాష్ట్రం ప్రతిష్ట నాశనమైందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు గిరిజన మహిళలపై దాడి చేసి వారిని నగ్నంగా ఊరేగించిన ఘటనను రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తూ నిరసనలు మొదలుపెట్టారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలంతా డిమాండు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇద్దరు గిరిజన మహిళలను మూకలు నగ్నంగా ఊరేగించిన దృశ్యాలతో కూడిన వీడియో బుధవారం రాత్రి వెలుగుచూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News