Friday, December 27, 2024

యుఎన్‌ఎల్‌ఎఫ్‌తో ఒప్పంద సంతకాలు

- Advertisement -
- Advertisement -

అగర్తలా : మణిపూర్‌లో శాంతిస్థాపనకు మార్గం ఏర్పడింది. మణిపూర్‌కు చెందిన సాయుధ తిరుగుబాటు బృందం యుఎన్‌ఎల్‌ఎఫ్ కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. రాష్ట్రంలో నెలల తరబడి పలు తెగల మధ్య రిజర్వేషన్ల కోటా రగులుకుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది బలి అయ్యారు. అత్యధిక సంఖ్యలో జనం నిర్వాసితులుఅయ్యారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ చొరవతో తిరుగుబాటుదార్ల బృందాలతో సంప్రదింపులు జరిగాయి. ఇవి ఫలించాయి. యుఎన్‌ఎల్‌ఎఫ్‌తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధి కుదిరింది. ఇప్పుడు శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో తెలిపారు. ఇది చారిత్రక ఘట్టం అని స్పందించారు. ఆరు దశాబ్దాలుగా ఈ తిరుగుబాటు దార్ల బృందంపై పోరుబాటలో ఉంది.

ఇప్పుడు చర్చల ప్రక్రియ ఫలించిందని, సిఎం చేపట్టిన చర్చలు ఫలించాయని హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్థారించారు. ఇప్పటి ఒప్పందంతో ఇంఫాల్ లోయకు చెందిన ఆర్‌కె మెఘెన్ ఆధ్వర్యపు ఈ సాయుధ బృందం తిరుగుబాటుకు కాలం చెల్లాల్సి ఉంటుంది. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) విరామంలేకుండా గెరిల్లా యుద్ధం సాగిస్తూ వస్తోంది. ఇటువంటి మరికొన్ని సాయుధ బలగాలు కూడా మణిపూర్‌లో ఉన్నాయి. వీటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించింది. వీటిలో పిఎల్‌ఎ కూడా ఉంది. ఇప్పటి ఒప్పందం పరిణామం కీలకమైనదని , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, సమ్మిళిత వికాసానికి తపిస్తున్న ప్రధాని మోడీ విజన్‌కు ఈ ఘట్టం వాస్తవిక రూపం ఇస్తుందని హోం మంత్రి స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News