Saturday, July 6, 2024

మణిపూర్ వాసులకు అస్సాం మానవతా సాయం

- Advertisement -
- Advertisement -

అస్సాంలో తలదాచుకుంటున్న మణిపూర్ వాసులకు మానవతా సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. మణిపూర్ లోని జిరీబామ్ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని 1700 మంది ప్రజలు అస్సాం లోని కాచర్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం మణిపూర్ నివాసితులకు కావాల్సిన సాయం అందజేయాలని సూచించారు. జిల్లా కమిషనర్ ఝా మాట్లాడుతూ ప్రస్తుతం కాచర్‌లో కుకీ,హ్మార్, నాగా, మైత్రేయి తెగలకు చెందిన 1700 మందిరి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.

అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. జూన్ మొదటివారంలో జిరిబామ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల అనంతరం అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అస్సాంలో తలదాచుకుంటున్న వారికి మానవతా సాయం అందిస్తున్నామని చెప్పారు. వీరి ఆశ్రయం పొందడానికి షెల్టర్లు, ఆహారం అందించామన్నారు. ఆయుధాలతో ఎవరూ కాచర్ లోకి ప్రవేశించకుండా మణిపూర్ సరిహద్దులో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News