Monday, January 20, 2025

ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటాం

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి మణిపూర్ గిరిజన సంఘం అల్టిమేటం

ఇంఫాల్ : తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్ లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేనిపక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చింది. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్ )ఆధ్వర్యంలో బుధవారం చురచంద్‌పూర్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. స్వయం పాలనకు సంబంధించిన తమ ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే 22 మంది గిరిజనుల హత్యపై సీబీఐ లేదా ఎన్‌ఐఏ చేత దర్యాప్తు జరిపించాలని కోరాయి.

ర్యాలీ సందర్భంగా ఐటీఎల్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి మువాన్ టోంబింగ్ మాట్లాడారు. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన కావాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. రెండు వారాల్లో మా గళం వినకపోతే , మా స్వపరిపాలనను మేమే ఏర్పాటు చేసుకుంటాం. కేంద్రం గుర్తించినా, లేకపోయినా ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం ముందుకెళ్తాం. కుకీజో ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిశీలించే స్వయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం,. అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News