Monday, December 23, 2024

ప్రధానికి కలిసే తీరికలేదు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ / న్యూఢిల్లీ : మణిపూర్ సంక్లిష్టత, హింసాత్మక పరిస్థితిపై వివరించేందుకు వచ్చిన మూడు రాష్ట్ర స్థాయి ప్రతినిధి బృందాలు ప్రధాని మోడీని కలువలేక వెనుదిరగాల్సి వచ్చింది. పరిస్థితిని స్వయంగా సమీక్షించి ఏదో ఒక్క పరిష్కారానికి స్పందించాల్సి ఉందని ప్రధాని మోడీని కలిసేందుకు, ఆయనకు విజ్ఞప్తి పత్రం సమర్పించేందుకు ఇటీవలి కాలంలో మూడు ప్రతినిధి బృందాలు ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చి నిరాశతో వెనుదిరిగాయి. ఈ ప్రతినిధి బృందాలలో రెండు అధికార బిజెపికి చెందినవి. కాగా మరోటి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందినది.

ప్రధానిని కలిసి మణిపూర్ గోడు విన్పించేందుకు వీరు కొద్దిరోజుల తరబడి ఢిల్లీలో మకాం పెట్టినా ఫలితం లేకుండా పోయింది. మే నెల ఆరంభం నుంచే మణిపూర్‌లో రగులుకున్న రిజర్వేషన్ల కోటా ప్రాణనష్టానికి, తీవ్రస్థాయిలో శాంతిభద్రతల సవాళ్లకు దారితీసింది. వేలాది మంది నిర్వాసితులు అయ్యారు. దీనితో ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించేందుకు ప్రతినిధి బృందాలు ఢిల్లీకి వెళ్లి వట్టి చేతులతో తిరిగి వచ్చిన విషయం వెల్లడైంది.

అయితే మణిపూర్ విషయంలో తాము ఇక ఇప్పట్లో ప్రధానిని కలుసుకునేందుకు వీల్లేదని నిర్థారించుకున్న బృందాలు చివరికి ప్రధాని కార్యాలయం అధికారులకు తమ విజ్ఞప్తిని అందించి వెళ్లాయి. రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దయనీయం అయిందని , తక్షణం స్పందించాల్సి ఉందని లేకపోతే చట్టపరమైన పాలనా, అధికారిక వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సడలుతోందని ఈ విజ్ఞప్తిలో తెలిపివచ్చారు.

తమ ప్రతినిధి బృందానికి అవకాశం ఇవ్వకపోయినా కనీసం బిజెపి బృందానికి అయినా, బాధిత వర్గం అయిన కుకీలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందానికి అయినా కలిసే అవకాశం ఇవ్వాల్సిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. అయితే ఈ నెల 25 వరకూ ప్రధాని మోడీ అమెరికా, ఈజిప్టుల్లో పర్యటనల్లో తీరికలేకుండా ఉన్నందున అంతకు ముందు ఇతర పనులతో వీలు చిక్కనందున ప్రతినిధి బృందాలను కలిసేందుకు వీల్లేదని పిఎంఒ వివరణ ఇచ్చుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News