Sunday, December 22, 2024

వాస్తవాలు తెలుసుకుని పార్లమెంటుకు నివేదిస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ వారాంతంలో మణిపూర్‌లో పర్యటించనున్న ప్రతిపక్ష కూటమి‘ ఇండియా’కు చెందిన ఎంపీల ప్రతినిధి బృందం అక్కడి వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించి హింసతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫార్సులు చేస్తుందని ప్రతిపక్ష నేతలు శుక్రవారం చెప్పారు. కాగా రాష్ట్రంలో ఈ బృందం పర్యటనకు ఒక రోజు ముందు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌నుంచి అధిర్ రంజన్ చౌదరి, గొగోయ్, సుస్మితా దేవ్( టిఎంసి) మహువా మఝి( జెఎంఎం) కనిమొళి( డిఎంకె), వందరా చవాన్( ఎన్‌సిపి), జయంత్‌చౌదరి( ఆర్‌ఎల్‌డి) , మనోజ్ కుమార్ ఝా( ఆర్‌జెడి) ఎన్‌కె ప్రేమచంద్రన్( ఆర్‌ఎస్‌పి), సంతోష్ కుమార్( సిపిఐ), ఎ ఎ రహీం( సిపిఎం), తిరుమావలన్( విసికె) సహా 20 మంది ఎంపీలు ఉండే అవకాశం ఉంది. ‘ఇండియా’ ఎంపిలు మణిపూర్‌కు వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారని, వాస్తవాన్ని పార్లమెంటు ముందు ఉంచుతారని శుక్రవారం పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ గొగోయ్ చెప్పారు.

తాము మణిపూర్ ప్రజలతోనే ఉన్నామనే సందేశాన్ని ప్రతిపక్షాల ప్రతినిధిబృదం ఇవ్వాలని అనుకుంటోందని టిఎంసి ఎంపి సుస్మితాదేవ్ చెప్పారు. ప్రతినిధి బృందం శనివారం ఉదయం మణిపూర్‌కు బయలుదేరి వెళ్తుందని, ఎక్కడ తప్పుజరిగిందో, ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందో తెలుసుకుంటుందని డిఎంకె ఎంపీలు కనిమొళి, టిఆర్ బాలు చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడమే తమ పర్యటన ఉద్దేశమని ఆర్‌ఎస్‌పి ఎంపి ప్రేమచంద్రన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News