Monday, December 23, 2024

మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి శాంతి కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ నేతృతంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, కొందరు రాష్ట్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు కమిటీలో ఉంటారు. వీరితోపాటు మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు కమిటీలో ఉంటారు.

రాష్ట్రంలోని వివిధ జాతులు, సామాజికవర్గాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పడం ఘర్షణ పడుతున్న పార్టీలు, గ్రూపుల మధ్య శాంతియుత చర్చలు జరపడం కమిటీ ప్రధాన లక్షం. జాతుల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహన, సుహృత్ సంబంధాలు పెంపొందించడం ఈ కమిటీ బాధ్యతగా హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రహోం మంత్రి అమిత్‌షా మణిపూర్‌ను సందర్శించిన తరువాత శాంతికమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన హింసాయుత సంఘటనలకు సంబంధించి నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లు, నేరపూరిత కుట్రకోణంలో నమోదైన ఐదు కేసులు, సాధారణ కుట్రపై నమోదైన ఒక కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని షా ప్రకటించారు. సిబిఐ ఆరు కేసులను నమోదు చేయడమే కాక, దర్యాప్తుకు పదిమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News