Friday, December 27, 2024

మణిపూర్ హింసాకాండను తక్షణమే నిలిపివేయాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: మణిపూర్ మారణహోమాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ యునా లెవెల్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శనివారం నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఫోరం అధ్యక్షులు నోబెల్ సింగ్ సన్, కోఆర్డినేటర్ ఫెన్సెస్ హావుకిర్, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సన్, లంఖన్ పియాంగ్ పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ మణిపూర్‌లో అత్యధిక బాగాన్ని హత్య క్షేత్రా లుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసాకాండ వలన ఎంతోమంది గిరిజన మహిళలు చిన్నారులు, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. అనేక మంది గాయాలపాలయ్యారని ఆంధోళన చెందారు. ఈ ఘటనలో మరణించిన బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని, గాయపడిన వారిని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News