Wednesday, January 22, 2025

బాధిత మహిళలకు తక్షణ జరిగేలా చూడాలి: నాగా సంఘాలు

- Advertisement -
- Advertisement -

ఇదిలా ఉండగా గత మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను శనివారం రాష్ట్రంలో పలు నాగా పౌర సమాజాలు తీవ్రంగా ఖండించాయి. వీటిలో బలమైన యునెటెడ్ నాగా కౌన్సిల్, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ లాంటి సంఘాలు కూడా ఉన్నాయి.ఈ కేసులో న్యాయం వెంటనే లభించేలా చూడడం కోసం మణిపూర్ ప్రభుత్వం దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నాగా కౌన్సిల్ డిమాండ్ చేసింది.ఈ అమానుష ఘటనతో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఆ సంఘం డిమాండ్ చేసింది.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

వైరల్ అయిన వీడియోను ప్రస్తావిస్తూ, పట్టపగలు, జాతీయ రహదారిపై మహిళలపై జరిగిన ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని నాగా కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్‌లో ఇటీవల జాతుల మధ్య చెలరేగిన హింసాకాండకు ఇప్పటివరకు నాగాలు చాలా వరకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు వారు కూడా తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News