Saturday, December 21, 2024

కమల్ హాసన్ మూవీలో ఏడుగురు పాన్ ఇండియా స్టార్స్

- Advertisement -
- Advertisement -

యూనివర్సల్ కమల్ హాసన్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో నాయగన్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత నాయగన్ కాంబో రిపీట్ కాబోతోంది. ఇప్పటికే అధికారికంగా కమల్ మణిరత్నం సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇదే సమయంలో సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ఏడుగురు కీలకమైన గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మలయాళం, తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్‌ను ఈ సినిమా కోసం సంప్రదించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే మలయాళ స్టార్ మమ్ముట్టీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌లు ఈ సినిమాలో నటించేందుకు మణిరత్నంకు ఓకే చెప్పారని తెలిసింది.

ఏడుగురు స్టార్స్ ఒకే సినిమాలో కనిపించడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకూ సౌత్ ఇండియన్ సినిమాలోనూ నమోదు అవ్వని అరుదైన రికార్డుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోతున్న కమల్ సినిమాతో నమోదు కాబోబోతుంది. మణిరత్నం, కమల్‌లు ఈ సినిమాను తమ సొంత బ్యానర్‌లు మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ల్లో రూపొందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News