Thursday, January 23, 2025

కొత్త చిక్కుల్లో మనీష్ సిసోడియా: ప్రాసిక్యూట్‌కు సిబిఐకి అనుమతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఫీడ్ బ్యాక్ యూనిట్(ఎఫ్‌బియు) గూఢచర్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి మంజూరు చేసింది. ప్రాసిక్యూట్ అనుమతి కోరుతూ సిబిఐ పెట్టుకున్న దరఖాస్తును ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదించి కేంద్ర హోం వ్యవహరాల మంత్రిత్వశాఖను పంపించారు. ఢిల్లీ ప్రభుత్వంలోని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు సిసోడియా నేతృత్వం వహిస్తున్నారు.

ఈ శాఖ పరిధిలోనే ఆప్ ప్రభుత్వం 2015లో ఎఫ్‌బియుని ఏర్పాటు చేసింది. వివిధ మంత్రిత్వశాఖలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలపై నిఘా పెట్టేందుకు చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగేతర సంస్థగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. శాసన, న్యాయపరమైన పర్యవేక్షణకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈ ఎఫ్‌బియు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తోంది. వీరంతా నేరుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఎఫ్‌బియుకి సీక్రెట్ సర్వీస్ ఫండ్ పేరిట జరిపిన కేటాయింపులలో లెక్కల్లో చూపని ఖర్చుల వివరాలు ఉన్నాయన్న కేసు కూడా సిబిఐ దర్యాప్తు చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News