Wednesday, January 22, 2025

జైలులో తొలి రాత్రి: సిసోడియా పక్క సెల్‌లో గ్యాంగ్‌స్టర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సయిజ్ పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాకు రూస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జుడిషయల్ విధించడంతో సోమవారం సినోడియా తీహార్ ఒకటవ నంబర్ జైలులో మొదటి రోజు గడిపారు. ఆయనకు ఒక తాజా బెడ్‌షీట్, మూడు దుప్పట్లు, ఒక సోపును, ధరించేందుకు బట్టలను జైలు అధికారులు అందచేశారు.

తీహార్ జైలు ప్రాంగణంలో ఒకటవ నంబర్ జైలు అత్యంత పురాతనమైనదని జైలు అధికారులు తెలిపారు. సిసోడియాను ఉంచిన 9వ నంబర్ ఇతర ఖైదీలు ఎవరూ ఉండరని, ఆయన ఒక్కరే ఉంటారని అధికారులు చెప్పారు. అయితే ఒకటవ నంబర్ జైలులోనే కరడుగట్టిన నేరస్థులు పలువురు ఉన్నారు. టిల్లూ గ్యాంగ్ నాయకుడు సునీ మాన్ అలియాస్ టిల్లూ, గ్యాంగ్‌స్టర్ నసీర్, యోగి గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ యోగేష్ అలియాస్ తుండా కూడా ఇదే జైలులో ఉన్నారు.

సిసోడియాను జైలుకు మధ్యాహ్నం తీసుకెళ్లారు. ఆయనకు మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు నివేదికలు నివేదికలను జైలు సూపరింటెండెంట్‌కు పంపించిన తర్వాత ఆయనకు ఏ సెల్‌ను కేటాయించాలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6.30-7.00 గంటల ప్రాంతంలో భోజనం కోసం తీసుకువెళ్లారు. అక్కడ ఆయనకు రోటీలు, రైస్, దాల్, ఆలో మటర్ సబ్జీ అందచేశారు. భోజనం తర్వాత ఆయనను తిరిగి సెల్‌కు తీసుకువచ్చారు. ఆయన తన వెంట వస్తువులేవీ తీసుకురాలేదని, ఆయన కుటుంబ సభ్యులు తర్వాత వాటిని తీసుకువస్తే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

సిసోడియా విచారణ ఖైదీ కాబట్టి ఆయన తన సొంత దుస్తులు వేసుకోవ్చని వారు చెప్పారు. కాగా..అంతకుముందు కోర్టులో తనకు ఒక కాపీ భగవద్గీత, కళ్లజోడు, డైరీ, ఒక పెన్ ఇప్పించాలని సిసోడియా కోరడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. సిసోడియాను విసాసన(ధ్యాన) సెల్‌లో ఉంచాలని జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే జైలులో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకమైన సెల్ ఏదీ లేదని, ఇతర ఖైదీలందరితోపాటు ఆయన కూడా ధ్యానం చేసుకోవడానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఆయన కోరినట్లు పె, డైరీ లేదా బుక్, భగవద్గీత ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కళ్లజోడు ఆయన కుటుంబం తీసుకురావలసి ఉంటుందని అధికారులు వివరించారు. సిసోడియా ఒకటవ నంబర్ జైలులో ఉండగా మరో మాజీ మంత్రి,ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఏడవ నంబర్ జైలులో ఉన్నారు. ఒకటవ నంబర్‌తో పోలిస్తే ఏడవ నంబర్ జైలులో ఖైదీల సంఖ్య తక్కువ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News