Thursday, January 23, 2025

సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. సిబిఐ దాఖలు చేసిన ఈ కేసులో సిసోడియా పలుకుబడి గలిగిన నేత అని, ఆయన అధికారులను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారని, సాక్షుల్లో ఎక్కువ మంది ప్రభుత్వోద్యోగులు కాబట్టి వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, సౌత్ గ్రూప్ చెప్పినట్టుగా దురుద్దేశంతో ఈ మద్యం విధానాన్ని రూపొందించారని వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రస్వభావం కలిగివని, సాక్షులను ప్రభావితం చేసే అంశాన్ని తోసిపుచ్చలేమని తెలిపింది.

ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ మంగళవారం ఉదయం తీర్పు వెలువరించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెయిల్ కోసం సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు ఆద్మీపార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సిసోడియా కస్టడీని ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి కస్టడీ లోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News