Sunday, December 29, 2024

మనీశ్ సిసోడియాకు తాత్కాలిక బెయిల్ నిరాకరించిన కోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆరోపిత ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియాకు తాత్కాలిక బెయిల్ ఇవ్వనిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ వీలును బట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోగా ఎప్పుడైనా ఒక్క రోజు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూడడానికి అనుమతించారు. అది కూడా కస్టడీలోనే.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన మనీశ్ సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసుకోడానికి తాను తప్ప ఎవరు లేరని కోర్టుకు విన్నవించుకున్నప్పటికీ, ఆరు వారాలు తాత్కాలిక బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ కోర్టు మన్నించలేదు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పెట్టుకున్న వినతి హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. సిసోడియాను మార్చి 9న అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్షాలు లేకుండా చేస్తారని వ్యతిరేకించింది. పైగా ఈడి తరఫు న్యాయవాది వాదిస్తూ సిసోడియా భార్య గత 20 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఇప్పుడేమి కొత్త కాదని కోర్టుకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News