Sunday, December 22, 2024

సిసోడియాకు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తిరిగి నిరాశే ఎదురైంది. తనకు బెయిల్ ఇవ్వాలనే సిసోడియా అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున తాను వెంట ఉండాలని ఆయన వేడుకున్నారు. అయితే ఆయనపై తీవ్రస్థాయి అభియోగాలు ఉన్నందున , సాక్షాధారాలు తారుమారయ్యే ప్రమాదం దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపిన న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ సిసోడియా ఏదో ఒక్కరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ భార్య వద్ద ఉండేందుకు అనుమతిని ఇస్తున్నట్లు తెలిపారు.

ఆప్ ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. స్కామ్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపే ఛార్జిషీట్లను పరిశీలించిన తరువాత తాత్కాలిక బెయిల్ ఇవ్వడం కుదరడం బెయిల్ ఇవ్వడానికి వీల్లేదనే నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి తెలిపారు. అంతకు ముందు కోర్టు వారు సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆమె చికిత్స పొందుతోన్న ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి నుంచి వెంటనే ఆమె ఆరోగ్య స్థితిపై తమకు తెలియచేయాలని తెలిపిన కోర్టు ఆమెను ఎయిమ్స్ వైద్యుల బృందం పరీక్షించాలని, అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు.

తాను ఒక్కడినే భార్య బాగోగులను చూసుకోవల్సి ఉందని, తనకు ఆరువారాల తాత్కాలిక విముక్తి కల్పించాలని సిసోడియా అప్పీలు చేశారు. మార్చి 9న సిసోడియా అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన ఇడి కేసుకు సంబంధించి జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News