Friday, January 24, 2025

చిక్కుల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరింత సంక్లిష్టత ఎదురైంది. సిసోడియా ఇతరులపై సిబిఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీటను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు శనివారం స్థానిక రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం తెలిపింది. దీని ప్రాతిపదికన మనీష్ సిసోడియాకు ఇతర ముగ్గురు నిందితులకు జూన్ 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు సమన్లు వెలువరించింది.

ఇప్పటికే ఈ కేసులో బెయిల్ దక్కక సిసోడియా జైలులో ఉన్నారు. పలువిధాలుగా ఈ కేసులో సిసోడియా ఇతరుల ప్రమేయం ఉందని, ఓ దశలో ఆయన తన సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు అంగీకరించారని సిబిఐ తాజా ఛార్జీషీట్‌తో తెలిపింది. ఇది సిసోడియాకు మరింత చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇప్పటి చార్జీషీట్‌ను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ తెలిపారు. సిసోడియాతో పాటు అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధాల్‌పై అభియోగాలను తాజాగా మోపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News