Sunday, January 19, 2025

మొన్న జైన్.. తర్వాత అరెస్టయ్యేది మనీశ్ సిసోడియానే: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Manish Sisodia likely to be arrested next Says Delhi CM

కేంద్రంపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు… బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇరికిస్తున్నారని , త్వరలో ఆయనను కూడా అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. జైన్ అరెస్టుకు కొన్ని నెలల ముందు ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సిసోడియాను త్వరలో అరెస్టు చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయనపై తప్పుడు కేసులు పెట్టమని కేంద్రం అన్ని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. మా అందరిపై ఒకేసారి రైడ్ చేయించండి. అరెస్టు చేసి, దర్యాప్తు జరపండి. ఆ తర్వాత మేం మళ్లీ మా పనిలోకి వెళ్లి పోవచ్చు. ఎందుకంటే మాకు రాజకీయాలు అర్ధం కావు. మేం కేవలం పనిచేయాలనుకుంటున్నాం. విద్యారంగంలో మనీశ్ సిసోడియా చేస్తోన్న కృషి కారణంగా లబ్ధి పొందిన 18 లక్షల మంది చిన్నారులను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను.

ఆయన అవినీతి పరుడా ? ఆయన భారత ఖ్యాతిని పెంచారు. అటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలా ? రివార్డు ఇవ్వాలా ? సత్యేందర్ జైన్ మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటులో అందరికీ టీకాలు అందడంలో సహకరించారు. కానీ ఇప్పుడు వారిని అవినీతి పరులంటున్నారు. మరి వారిద్దరు అవినీతి పరులైతే నిజాయతీపరులు ఎవరో చెప్పాలి ? అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఎప్పుడూ ఇలాంటి దర్యాప్తులు ఎదుర్కొంటుంటే ఇక మేం ఎప్పుడు పనిచేయాలని అడిగారు. ఏదేమైనప్పటికీ, ప్రజలు మా వెంటే ఉంటారని, ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జైన్ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News