సిసోడియాను భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 9.00 గంటలకు ఆయన నివాసానికి తీసుకెళ్లినట్లు జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన తిరిగి సాయంత్రం 5.00 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం తీహార్ జైలు నుంచి తన ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన సతీమణిని చూడడానికి ఆయనకు కోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఇంటి వద్ద తన భార్యను చూడడానికి ఆయనకు అనుమతిని ఇచ్చింది.
సిసోడియాను ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు తన భార్యను కలిసేందుకు అనుమతించాలని న్యాయమూర్తి దినేశ్ శర్మ తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సిసోడియాను భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 9.00 గంటలకు ఆయన నివాసానికి తీసుకెళ్లినట్లు జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన తిరిగి సాయంత్రం 5.00 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసింది. మే 30న ఆయనకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆయనను మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) మార్చి 9న ఇదే కేసులో అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కుటుంబ సభ్యులు మినహా మీడియాతోగానీ, ఇతరులతోగానీ మాటామంతీ జరపొద్దని సిసోడియాను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అంతేకాక ఫోన్ లేక ఇంటర్నెట్ వాడకూడదని కూడా ఆదేశించింది.